మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (13:50 IST)

ముడతల చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణంగా కొంతమందికి కళ్ల చివర్లు, పెదవుల చుట్టూ ముడతలు వస్తుంటాయి. చర్మంపై సన్నటి గీతల్లా కనిపించే ఈ ముడతలను మాయం చేసే సులువైన ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
ముందుగా.. తేనెకు గుడ్డు తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లటి పాలలో ముంచిన దూదితో తొలగించి, చల్లటి నీటితో కడుక్కుని నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేసినట్లయితే ముఖంపై ముడతలు మటుమాయమవుతాయి.
 
అలాగే... శెనగపిండి, వరిపిండి చెరో చెంచా చొప్పున తీసుకుని దానికి కొద్దిగా పాలు, ఆలివ్ లేదా ఏదైనా వంటనూనె నాలుగైదు చుక్కలు కలిపి బాగా మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మం కొత్త నిగారింపును సంతరించుకునే ఈ స్క్రబ్ పొడి చర్మం కలిగినవారికి ఎంతగానో మేలు చేస్తుంది.