శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (17:31 IST)

మెడ నలుపుగా మారితే.. ఏం చేయాలి..?

మహిళలు తమ ముఖారవిందం కోసం గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇలాంటివారు చిన్నపాటి చిట్కాలను పాటించడం వలన తమ సమయం వృధా కాకుండా చేయడమే కాకుండా, మరింత అందంగా ముస్తాబయ్యేందుకు అవకాశం ఉంది. 
 
మెడ నలుపుగా మారితే బొప్పాయి గుజ్జును మెడకు పట్టిస్తే నల్లరంగు మారుతూ వస్తుంది. మోచేతులు నల్లగా ఉంటే ఆలివ్ఆయిల్‌తో మసాజ్ చేసి నిమ్మకాయ రసంతో రుద్దినట్టయితే ఆ నల్లని మచ్చలు పోయేందుకు ఆస్కారముంది.
 
మేకప్ చేసుకునే ము౦దు ముఖానికి ఐస్ క్యూబ్ రుద్దినట్లయితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. బిరుసుగా ఉండే పాదాలకు నాలుగు చెంచాల పెరుగు, ఒక చెంచా వెనిగర్ కలిపి రాస్తే మృదువుగా మారిపోతాయి. పరగడుపున వేడి నీటిలో ఒక స్పూన్ తేనే కలుపుకుని తాగుతుంటే నాజుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.