విజేతలైన మహిళలు ఆదివారం పాటించే నియమాలేంటో తెలుసా?

Last Updated: గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:54 IST)
సాధారణంగా మహిళా ఉద్యోగినులకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ సెలవు ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బోలెడు పనులు అంటూ అన్నింటినీ ఏకరవు పెట్టకూడదు. అసలు విజేతలైన మహిళలు ఆదివారం పాటించే నియమాలేంటో ఓసారి పరిశీలిద్దాం..

సాధారణ రోజుల్లో ఏ పనులు ఎప్పుడు చేయాలో ఓ ప్రణాళిక వేసుకుంటాం.. అదేవిధంగా ఆదివారం రోజున కూడా పాటించాలి. ఉదాహరణకు ఓ గంట దుస్తుల కోసం కేటాయించండి. వారం మొత్తానికి ఏం వేసుకోవాలనేది సిద్ధంగా పెట్టుకుంటే మిగిలిన రోజుల్లో ఎంతో సమయం కలిసొస్తుంది. తప్పక ప్రయత్నించి చూడండి.

ఆదివారం రోజున కనీసం ఓ అరగంట అయినా.. రాబోయే వారం రోజులు ఏయే పనులు చేయాలో ఆలోచించుకోవాలి. అవసరమైతే కొన్నింటిని రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వలన మనకు ఏం చేయాలో తెలుస్తుంది. మర్చిపోయే పరిస్థితి ఎదురుకాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి సమస్య అసలు ఉండదు.

ఇక ఇంటిని సర్దుకునే పనులు మాత్రం పెట్టుకోరట చాలామంది. అందుకు బదులుగా విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించుకుంటారు. అలానే వారంలో ఎంత సమయం కుటుంబానికి కేటాయించాలి.. వ్యక్తిగత సమయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆలోచిస్తారు.

విజేతలైన స్త్రీలు చేసే మరో పని ఏంటో తెలుసా.. డిజిటల్ డిటాక్స్ పాటించడం. అంటే సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లకు దూరంగా ఉండడం. రోజంతా కాకపోయినా.. వీలైనన్ని ఎక్కువ గంటలు అలా గడిపేందుకు ప్రయత్నిస్తే చాలు.దీనిపై మరింత చదవండి :