ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-10-2019 మంగళవారం మీ రాశి ఫలితాలు- కార్తికేయుడిని పూజిస్తే..

మేషం: వస్త్ర, బంగారు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అంత సఖ్యత వుండదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. 
 
వృషభం: వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలెదుర్కుంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురచేస్తుంది. రాబడికి మించిన ఖర్చులెదురవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. 
 
మిథునం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. 
 
కర్కాటకం: చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటలు ఇథరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. వారసత్త్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
సింహం: గృహంలో ఏదైనా వస్తువు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్య: దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తారు. జాయింట్ వెంచర్లు ఉమ్మడి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. రిప్రజింటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన వల్ల ఆకర్షితులవుతారు. 
 
తుల: వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు ఏ పని యందు ధ్యాస ఉండదు. బంధువుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. విందులు, వినోదాల్లో కొత్త పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
వృశ్చికం: వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి తప్పుదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రుణయత్నాలు అనుకూలతలుంటాయి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
ధనస్సు: ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి అవకాశం ఉంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. వాహనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
మకరం: ట్రాన్స్‌ఫోర్ట్, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం క్షేమదాయకం. స్త్రీలకు పని ఒత్తిడి, హడావుడి అధికం. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. రావలసిన ధనం, ఆలస్యంగా అందడం వల్ల ఒడిదుడుకులు తప్పవు. 
 
కుంభం: నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. తరచూ సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. 
 
మీనం: దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రేమికులు ప్రతి విషయంలోను మితంగా వ్యవహరించడం క్షేమదాయకం.