మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (11:36 IST)

21-09-2019 సోమవారం మీ రాశి ఫలితాలు

మేషం: గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదా పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఉమ్మడి వెంచర్లు, దీర్ఘకాలిక పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయిండి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యవహారాలు, పనులు మీరు చూసుకోవడమే మంచిది. సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు. 
 
వృషభం: ఆర్థికలావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనుకున్నది సాధించేంతవరకూ శ్రమిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. బంధుమిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. 
 
మిథునం: బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలతెత్తే సూచనలున్నాయి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతారు. అర్థవంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం: కుటుంబంలో ప్రేమానుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. ఆశాభావంతో ఉద్యోగయత్నం సాగించండి. దైవ, సేవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. మీ భార్య వైఖరి చికాకు కలిగిస్తుంది. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. 
 
సింహం: ఉద్యోగస్తులకు ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయం సకాలంలో అందక నిరుత్సాహం చెందుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. 
 
కన్య: పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పనిభారం, ఒత్తిడి అధికం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు దూకుడు తగదు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. తలపెట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. 
 
తుల: కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: ఉద్యోగల్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో తీరిక, విశ్రాంతి వుండవు. ఒకరికి సాయం చేసి మరొకరికి ఆగ్రహానికి గురవుతారు. వివాదాలకు ఆస్కారం వుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
ధనస్సు: ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసి విషయంలో పునరాలోచన అవసరం. సిమెంట్, ఇటుక, ఇసుక రంగాల్లో వారికి అభివృద్ధి కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: మీ లక్ష్యసాధనకు ముఖ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసే పనులకు బంధువుల నుంటి విమర్శలు, వ్యతిరేకత ఎదర్కోక తప్పదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పీచు, ఫోమ్, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం: రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏసీ, ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేసుకోవడం మంచిది. 
 
మీనం: రాజకీయ నాయకులు తరచు సభ సమావేశాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి వ్యవహరించలసి ఉంటుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ వహించండి.