శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (18:43 IST)

సోమవారం (14-10-2019) దినఫలాలు - రుణాల కోసం.. పనివారికి పనివారలతో...

మేషం: వృత్తి వ్యాపారాల్లో ప్రజా సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. ఆడిటర్లు అసాధ్యమనుకున్న కేసులు సునాయసంగా పరిష్కరిస్తారు. మీ ఆశయ సాధనకు నిత్య కృషి, పట్టుదల ముఖ్యం.
 
వృషభం: ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. బ్యాంకు వ్యవహారాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత అవసరం. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు.
 
మిధునం: ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. ముఖ్యుల కోసం షాపింగ్‌‌లు చేస్తారు. మిత్రబృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికివస్తారు.
 
కర్కాటకం: నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. లాయర్లకు రాణింపు ఇతరుల వివాదాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
సింహం: రాజకీయనాయకులు తరుచు సభాసమావేశాలలో పాల్గొంటారు. కళాకారులకు రచయితలకు, పత్రికా రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. శ్రమకు తగిన ఫలితందక్కుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. మీ కుటుంబీకుల మొండితనం, పట్టుదల వల్ల ఒకింత ఆసహనానికి గురవుతారు.
 
కన్య: ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విధి నిర్వహణలో దొర్లిన తప్పిదాల వల్ల పత్రికా సంస్థలలోని వారికి మనస్థిమితం అంతగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
తుల: మీ శ్రీమతి ఇచ్చిన సలహా పాటించటం మంచిది. తోటివారి సహాకారం వల్ల మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు.
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ఆలయాలను సందర్శిస్తారు. అపరాలు, ధాన్యం, స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. వైద్యులకు మెళుకవ అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు: ప్లీడరు, గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహమార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ఆకస్మిక మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారులతో తనిఖీలు, పర్యటనలు తప్పవు. వ్యవసాయ రంగంలోని వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం: ప్రభుత్వ సంబంధిత కార్యాలు సకాలంలో నెరవేరుతాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాలలో వారికి అనుకూలిమైన కాలం. రాజకీయ నాయకులు కార్యకర్తల వలన చికాకులు తప్పవు. మధ్య మధ్య ఔషద సేవ తప్పదు. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును.
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ కలిసిరాదు. కుటుంబ విషయాలలో ఇతరుల జోక్యం మీకు చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
మీనం: దైవ పుణ్యకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.