19-10-2019- శనివారం దినఫలాలు - సంతానం చదువుల పట్ల..

astro 11
రామన్| Last Updated: శనివారం, 19 అక్టోబరు 2019 (09:13 IST)
మేషం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్ధేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు.

వృషభం: గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలంకానవచ్చును. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు.

మిధునం: మీ సంతానం చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కానబరుస్తారు. ప్రయాణాల విషయంలో ముందుచూపు ఎంతో అవసరం. మీ ఆలోచనలు పంచుకొనే వారికోసం మనసు తహతహలాడుతుంది. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు. స్త్రీలకు ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం: ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

సింహం: వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించండి అనుకున్నది సాధిస్తారు. దుబారా ఖర్చులు అధికం. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.

కన్య: వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరోవిధంగా భర్తీ చేసుకుంటారు. పరస్పరం విలువైన కానుకలిచ్చిపుచ్చికుంటారు. సోదరీ, సోదరులు, బంధువుల మధ్య బాంధవ్యాలు మరింత బలపడతాయి. పత్రికాసంస్థలో వారికి పనిభారం అధికం. మీ కుటుంబీకులతో కలిసిఆలయాలను సందర్శిస్తారు.

తుల: వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌‌‌కు కొంతమంది అడ్డుతగలుగుతారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచటం మంచిది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు.

వృశ్చికం: రావలసిన ధనం చేతికందడంతో ఖర్చులు అధికం. పెద్దల ఆరోగ్యము గురించి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోచవటం శ్రేయస్కరం. స్త్రీలకు టి.వి. ఛానల్స్ కార్యక్రమాల సమాచారం అందుతుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం.

ధనస్సు: స్థిరాస్తి వ్యవహారాలు, కుటుంబ సమస్యలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రైవేటు రంగాల వారికి చికాకులు అధికం. బంధువుల గురించి ప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్త తీసుకోండి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

మకరం: మీ సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలు ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింత కృషి చేయవలసి ఉంటుంది.

కుంభం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. వస్త్ర, ఫాన్సీ, స్టేషనరీ, పాదరక్షల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది.

మీనం: పారిశ్రామిక, వైద్య రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రేమికుల వ్యవహారం సమస్యాత్మకమవుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరోవిధంగా భర్తీ చేసుకుంటారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండండి.దీనిపై మరింత చదవండి :