18-10-2019- శుక్రవారం దినఫలాలు - ఆకస్మిక పుణ్యక్షేత్ర సందర్శన...

astro 12
రామన్| Last Updated: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (09:52 IST)
మేషం: అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, కార్యాలయ పనులతో హడావుడిగా గడుపుతారు. రుణంలో కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. దుబారా ఖర్చులు అధికం.

వృషభం: ఆకస్మిక పుణ్యక్షేత్ర సందర్శన వంటి ఫలితాలున్నాయి. చేపట్టిన పనులందు ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఇతరుల సలహా విన్నప్పటికీ సొంతంగా నిర్ణయం తీసుకోవటం శ్రేయస్కరం. వ్యాపారాల్లో అమలు చేసిన స్కీములు మెరుగైన ఫలితాలిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

మిధునం: కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. ఏ విషయంలోను ఏకపక్ష నిర్ణయం మంచిది కాదు. ఏది జరిగినా మంచికేనని భావించాలి. మీ గౌరవ ప్రతిష్టలు భంగం కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ సంతానం పై చదువులు, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ వహిస్తారు.

కర్కాటకం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. గత అనుభవంతో ఒక సమస్యను అధికమిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు.

సింహం: స్త్రీలపై శకునాలు, దుస్వప్నాల ప్రభావం అధికం. రావలసిన ధనం సకాలంలో అందక ఇబ్బందులెదుర్కుంటారు. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినవలసివస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఆర్థిక, కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. మీ అంచనాలు, ఊహలు ఫలిస్తాయి.

కన్య: గృహ నిర్మాణాలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఈ సమస్యలు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యములో సమస్యలను ఎదుర్కొంటారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.

తుల: వస్త్ర, ఫాన్సీ, పచారి, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ధనం బాగా అందుటవలన ఏ కొంతయినా నిల్వచేయగలుగుతారు. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. వృత్తుల వారికి శ్రమ అధికం, ప్రతిఫలం స్వల్ప అన్నట్టుంటుంది.

వృశ్చికం: చిట్స్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. ఖర్చులు అధికమవుతాయి.

ధనస్సు: పత్రికారంగంలోని వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ లక్ష్యం నెరవేరదు. స్త్రీలలో ఒత్తిడి, హడావిడి చోటు చేసుకుంటాయి.

మకరం: సాంకేతిక రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. మీ సహాయం పొంది మీ మీద అభాండాలు వేసేవారు అధికం అవుతున్నారని గమనించండి. రుణాలు చెల్లిస్తారు.

కుంభం: ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సన్నిహితుల సహాయ సహకారాలు లభించగలవు. అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. రవాణా రంగాలలోని వారికి ప్రయాణీకుల వల్ల ఇబ్బందులు తప్పవు. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు.

మీనం: మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు క్షేమంకాదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం కానవస్తుంది. చిన్న చిన్న పొరపాట్లే సమస్యలకు దారితీస్తాయి. సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు.దీనిపై మరింత చదవండి :