ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (15:16 IST)

07-03-2020 శనివారం రాశిఫలాలు : వేంకటేశ్వరుని ఆరాధిస్తే...

మేషం : స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. మీ శ్రీమతి సలహా పాటిండం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిని మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మీడియా రంగాలవారికి పనిభారం, ఒత్తిడి. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ లాభదాయకం. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడే సూచనలున్నాయి. 
 
మిథునం : వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బిల్లులు చెల్లిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మున్ముందు సత్ఫలితాలు ఉంటాయి. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
సింహం : మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు.
 
కన్య : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు, అభిప్రాయభేదాలు తప్పవు. స్త్రీలకు టీవీ ఛానెల్ళ ముంచి బహుమతులు, అవకాశాలు లభిస్తాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. 
 
తుల : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు గుర్తింపు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. సహోద్యోగులతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ శ్రీమతి నుంచి అందిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తలెత్తి సమసిపోతాయి. 
 
వృశ్చికం : స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెలకువ అవసరం. బాకీలు, ఇంటి అద్దెలు ఇతరాత్రా రావలసిన ఆదాయం సకాలంలో అందుతాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. 
 
ధనస్సు : విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. గృహ ప్రశాంతతకు భంగం వాటిల్లే సూచనలున్నాయి. న్యాయవాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు మంచిదికాదు. 
 
మకరం : దైవ, సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. కొద్దిపాటి ధనసహాయం చేసి మీ సంబందాలు చెడకుండా చూసుకోండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో మితంగా వ్యవహరించండి. 
 
కుంభం : వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు తప్పవు. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందిపడతారు. ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. 
 
మీనం : లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.