బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-03-2021 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభ స్వామిని పూజిస్తే...

మేషం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బంధు మిత్రుల నుంచి అపనిందలు, అవమానాలు వంటివి ఎదుర్కొంటారు. 
 
వృషభం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ విషయంలోనూ మిత్రులపై ఆధారపడటం మంచిదికాదు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. కుటుంబ సౌఖ్యం మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రముఖులు ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. 
 
మిథునం : ఉద్యోగస్తులకు కార్యాలయం  పనులతోపాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు వంటివి తప్పవు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. కాంట్రాక్టులు బిల్డర్లు కొత్త పనులు చేపడతారు. మీ పెద్దల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు ఖర్చుల విషయంలో మెళకువ అవసరం. 
 
సింహం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయుకు మార్పులు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగాలి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
కన్య : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. విద్యార్థులు ఉపాధ్యాయులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఆడిట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
తుల : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రిప్రజెంటేటివ్‌లు అతికష్టంమ్మీద టార్గెట్లను పూర్తిచేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విద్యుత్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృశ్చికం : దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. మీ ప్రత్యర్థుల శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. ఖ్చర్చులుతగ్గించుకునే మీ యత్నం అనుకూలించదు. 
 
ధనస్సు : రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ప్రతి విషయంలోనూ ఏకాగ్రత అవసరం. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, బదిలీలు త్వరలోనే అనుకూలించగలవు. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థతకు గురవుతారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడగలవు. 
 
మీనం : ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. స్త్రీలు విలాస వస్తువులు గృహోపకరణాలు అమర్చుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆలయ సందర్శనాలలో మెళకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.