గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-03-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడుని పూజించినా...

మేషం : బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు హోదా పెరగడంతోపాటు బరువు బాధ్యతలు కూడా అధికమవుతాయి. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికందుతుంది. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు నిరుత్సాహం తప్పదు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. విద్యార్థినిలు కొత్త విషయాల పట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనబరుస్తారు. 
 
మిథునం : ఉపాధ్యాయులకు విద్యార్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ముందుగా ఊహించిన ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
కర్కాటకం : వస్త్ర, కళంకారి, బంగారు, వెండి, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. స్త్రీలు చుట్టుపక్కల వారి నుంచి గౌరవం, ఆదరణం పొందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
సింహం : ఐరన్, సిమెంట్, స్టాకిస్టులకు పురోభివృద్ధి. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ విక్రయాలు వాయిదాపడుట మంచిది. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. 
 
కన్య : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
తుల : ఉద్యోగస్తులు అధికారులు తీరును గమనించి మెలగలవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు మదకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. 
 
వృశ్చికం : మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. రాజీయాలలో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. 
 
ధనస్సు : స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలించగలవు. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం అధికమవుతుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికుల వల్ల సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
మకరం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికం కావడంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. 
 
కుంభం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలు తమ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు జారవిడుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలంకారాలు, వస్త్రాలు, విదేశీ వస్తువులు పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. 
 
మీనం : కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. మీ పెద్దల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతిలోపం వంటి చికాకులు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి.