శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-04-2023 తేదీ మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల...

anjaneya swamy
మేషం :- ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. నిరుద్యోగులు, చేతి వృత్తుల వారికి ఆశాజనకం. వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
వృషభం :- వృత్తి వ్యాపారంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తారు. కృషిరంగానికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రలతో వేడుకల్లో పాల్గొంటారు.
 
మిథునం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
కర్కాటకం :- మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త చాలా అవసరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
సింహం :- విందు వినోదాలలో పాల్గొంటారు. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పనివారలతో సమస్యలు తలెత్తగలవు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నూతన వ్యాపారాల పట్ల మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
కన్య :- ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన సమాచారం అందుకుంటారు. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని కార్యాలు అప్రయత్నంగా పూర్తవుతాయి.
 
తుల :- పారిశ్రామికరంగాల వారికి కార్మికులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్యాటరింగ్ పనివారలు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. తరుచూ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులలో ఏకాగ్రత, పట్టుదల చోటు చేసుకుంటాయి.
 
వృశ్చికం :- కొబ్బరి, పానీయ వ్యాపారులకు కలసి వచ్చే కాలం. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఏజెంట్లు బ్రోకర్లు, రిప్రజెంటిటివ్‌లకు మిశ్రమ ఫలితం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక లేఖ మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు :- ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. వస్త్రాలు. ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకావాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. ఇతరుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
మకరం :- హోటలు తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యలతో అంతరంగిక విషయాలను చర్చిస్తారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలుమీకు అనుకూలిస్తాయి.
 
కుంభం :- కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. చిన్న తరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన ఆశాంతికి లోనవుతారు. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు.
 
మీనం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు.