శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-09-2024 శనివారం రాశిఫలాలు - వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనవసర జోక్యం తగదు. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీ వ్యాఖ్యలు కొందరు వక్రీకరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సంతానం కృషి ఫలిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. వ్యవహారానుకూలత ఉంది. పెద్దల సలహా పాటిస్తారు. ఖర్చులు సామాన్యం. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. ధైర్యంగా అడుగు వేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమ్మాటాలకు పోవద్దు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ముందుకు సాగవు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా ఖర్చుచేయండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. కుటుంబీకులను సంప్రదిస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధి పథకాలు చేపడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ప్రభుత్వా కార్యాలయాల్లో పనుల సానుకూలమవుతాయి. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. ప్రయాణం వాయిదా
పడుతుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను నమ్మవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు.