శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (09:12 IST)

24-06-2023 - శనివారం మీ రాశి ఫలితాలు.. శ్రీవారిని పూజిస్తే..

venkateswara swamy
శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం: - రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పని ముగింపు దశకు చేరుకుంటుంది. ప్రేమికుల మధ్య అవకాహనా లోపం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. కోర్టు వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు.
 
వృషభం :- మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది.
 
మిధునం:- ఆర్ధికపరమైన సమావేశాలు సత్ఫలితాలిస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. స్త్రీలకు భేషజాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలు చేతి వృత్తుల యందు బాగా రాణిస్తారు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. 
 
కర్కాటకం:- వృత్తి, వ్యాపారాల యందు అనుకూలత. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. కొత్త పరిచయాల వల్ల లబ్ది పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసివస్తుంది. 
 
సింహం:- పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. రాబడి బాగున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. స్త్రీలు భేషజాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం.
 
కన్య:- ఆర్ధిక విషయాల్లో ప్రోత్సహకరంగా ఉంటుంది. భాగస్వామిక, జాయింటు వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు గుర్తింపు, ప్రోత్సహం లభిస్తుంది.
 
తుల:- ఉద్యోగస్తులకు పై అధికారులు వల్ల ఇబ్బందులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వ మిత్రులకలయికతోమానసికంగా కుదుటపడతారు. ప్రయాణాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి.
 
వృశ్చికం:- ప్రైవేటు విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రుణ యత్నాలకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు అనుకూలించవు.
 
ధనస్సు:- ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. ప్రకటనలు, రవాణా, హోటల్, వ్యవసాయం, బోధన, కళాసాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు.
 
మకరం:- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. అన్ని వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడగలవు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం:- రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ కార్యక్రమాలుపనులు వాయిదాపడతాయి.
 
మీనం:- రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.