సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (17:45 IST)

17-01-2021 నుంచి 23-01-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
మనోధైర్యంతో ముందుకు సాగండి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు కలిసిరాగలవు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు విశ్రాంతి లోపం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అయినవారి ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహమార్పు అనివార్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరక వుండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయ, సేవా రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వాయిదా పడిని పనులు పూర్తి చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆది, సోమ వారాల్లో వ్యవహారాల్లో ఒప్పందాల్లో విషయంలో మెలకువ అవసరం. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు సామాన్యం. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మీ కృషి ఫలిస్తుంది. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మంగళ, బుధ వారాల్లో ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య అరమరికలు తగవు. ప్రతి విషయం మీ శ్రీమతికి తెలియజేయండి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. గృహమార్పు కలిసివస్తుంది. ఆధ్యాత్మిక సంస్థలకు సాయం అందిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం వుంది. కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. కుటుంబీకులకు ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా వుండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారుల తీరుని గమనించి మెలగండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
కన్య రాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం కదలికలపైన దృష్టి పెట్టండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. పట్టింపులు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శని, ఆది వారాలలో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పదోన్నతి, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థలలో మదుపు తగదు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోమ, మంగళ వారాల్లో ఊహించిన సంఘటనలెదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో జాగ్రత్త. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
కొత్త పనులు ప్రారంభిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బుధవారం నాడు పనులు సాగక విసుగు చెందుతారు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ధనానికి ఇబ్బంది వుండదు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన వుండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. నిరుద్యోగలకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంత వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య సఖ్యత నెకొంటుంది. కనిపించకుడా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. సంతానం చదువులపై శ్రద్ద వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యవహారానుకూలత వుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బుధవారం నాడు ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగలకు సదవకాశాలు లభిస్తాయి. చేతివృత్తుల వారికి ప్రోత్సాహకరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మీ నమ్మకం వమ్ము కాదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గురు, ఆది వారాలలో అనుకోని సంఘటనలెదురవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాన లోపం. సామరస్యంగా మెలగండి. ఆధిక్యత ప్రదర్శించవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికం.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. రుణ బాధల నుండి విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే వుంటాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. శుక్ర, శని వారాల్లో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.