సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Modified: సోమవారం, 20 డిశెంబరు 2021 (19:34 IST)

2022లో కర్కాటక రాశి అవివాహితులకు వివాహయోగం

కర్కాటరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం: 5 వ్యయం: 5 రాజ్యపూజ్యం: 5 అవమానం: 2

 
ఈ సంవత్సరం ఈ రాశివారి గోచారం ప్రకారం అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. పట్టుదలతో శ్రమించిన గాని వ్యవహారాలు అనుకూలించవు. మొండి బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. 

 
సంతానం విషయంలో శుభమే జరుగుతుంది. అవివాహితులకు వివాహయోగం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులు చేరువవుతారు. వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్య సేవలతో కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అధికారులకు పదోన్నతి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. 

 
ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఇబ్బందులెదుర్కుంటారు. వ్యవసాయ తోటల రంగాల వారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి ఉండదు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు బాగున్నా సంతృప్తి ఉండదు. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.