మర్రిచెట్ల పండ్లు.. ఆ వ్యాధిని దూరం చేస్తుందట? (video)
మర్రి చెట్టు నీడను ఇవ్వడమే కాదు... ఆ చెట్టులో పాలు, ఆకులు, చెక్క, పండ్లు, విత్తనాలు, మొగ్గలు, వేళ్ళు, కొమ్మలు.. ఇలా అన్నీ ఔషధ గుణాలతో కూడుకున్నవి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి ఆరోగ్యానికి మర్రిచెట్టు మేలు చేస్తుంది. ఎలాగంటే..? మర్రిచెట్ల పండ్లను ఎండబెట్టి పొడి చేసుకుని పంచదారతో కలుపుకుని తీసుకుంటే పైల్స్ వ్యాధి నయమవుతుంది.
చర్మం మిలమిల మెరిసిపోవాలంటే మర్రిచెట్టు చెక్కలు, పండ్లతో తయారు చేసిన సబ్బులను ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది. మర్రి చెట్టు పండు నొప్పులను నివారిస్తుంది. అంతేగాకుండా మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెడుతుంది. పంటినొప్పి ఏర్పడినట్లైతే ఈ పండ్లను లవంగాలను నోట్లో వుంచుకున్నట్లు పంటి వద్ద వుంచితే ఉపశమనం లభిస్తుంది.
అంతేగాకుండా మర్రిచెట్టు చెక్కను ఎండబెట్టి.. పొడి కొట్టి.. సమపాళ్లలో వెన్నను కలిపి రోజూ ఉదయం సాయంత్రం పూట నాలుగు గ్రాముల మేర పాలతో కలిపి తీసుకుంటే గర్భాశయానికి సంబంధించిన రోగాలు నయమవుతాయి.
మర్రిచెట్టు పండ్లను ఎండబెట్టి.. పొడిచేసుకోవాలి. 12 గ్రాముల మేర పాలలో కలిపి తీసుకుంటే ఇంద్రియాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ పౌడర్‌తో పళ్ళు తోముకుంటే.. దంతాలు, చిగుళ్లు బలపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.