మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (13:53 IST)

రోజూ టమోటా జ్యూస్‌లో బ్లాక్ సాల్ట్ చేర్చి తీసుకుంటే..?

ఉప్పు లేనిదే రుచి ఉండదు. ''అన్నేసి చూడు నన్నేసి చూడు'' అనే సామెత కూడా ఉంది. అయితే ఈ ఉప్పు మితంగా వాడాలి. ఇంకా బ్లాక్ సాల్ట్ (నలుపు రంగు)ను వాడితే.. ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. రోజుకు పది గ్రాముల ఉప్పునే వాడాలి అంటున్నారు వైద్యులు. రోజూ ఆహారంలో ఊరగాయ, చిప్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్‌ను అధికంగా తీసుకోకూడదు. వీటిలో ఉప్పు అధికంగా వుంటుంది. ఇవి రక్తపోటుకు కారణమవుతుంది. 
 
పంచదార అధికంగా తీసుకుంటే మధుమేహం తప్పదు. మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు పటిక బెల్లం వాడితే సరిపోతుంది. మరి అధిక రక్తపోటును నియంత్రించుకోవాలంటే బ్లాక్ సాల్ట్‌ను వాడాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఈ బ్లాక్ సాల్ట్ నేపాల్‌లో బాగా అందుబాటులో వుంటుంది. ఈ సాల్ట్ ప్రస్తుతం అన్నీసూపర్ మార్కెట్లలో లభ్యమవుతుంది. 
 
ఈ బ్లాక్ సాల్ట్‌లోనూ సోడియం క్లోరైడ్ వుంటుంది. బ్లాక్ సాల్ట్‌లో.. సీ సాల్ట్ కంటే సోడియం తక్కువగా వుంటుంది. అలాంటి బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటును దూరం చేసుకోవచ్చు. రోజూ టమోటా జ్యూస్‌లో బ్లాక్ సాల్ట్ చేర్చి తీసుకుంటే.. చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
 
అలాగే స్నానం చేసే నీటిలో బ్లాక్ సాల్ట్‌ను కలిపి చేస్తే చర్మ సమస్యలుండవు. పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. కాసింత బ్లాక్ సాల్ట్ ఉప్పును వేడినీటిలో వేసి.. మరిన్ని నీటిని చేర్చి.. కాళ్లను ఆ నీటిలో అరగంట వుంచి తీస్తే పగుళ్లు తొలగిపోతాయి.