ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (10:26 IST)

ఖాళీ కడుపుతో 5 కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ తింటే?

Garlic_Curry Leaves
Garlic_Curry Leaves
రోజూ కరివేపాకు, వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజుకు ఐదు కరివేపాకులు, ఒకే ఒక వెల్లుల్లి తినడం వల్ల అనారోగ్య సమస్యలుండవు. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఉదయం లేవగానే 5 కరివేపాకు, ఒక వెల్లుల్లి రెబ్బ తిని, ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
 
కరివేపాకు, వెల్లుల్లిని పచ్చిగా, అది కూడా ఖాళీ కడుపుతో తీసుకుంటే, వాటిలోని పోషకాలన్నీ పూర్తిగా శరీరంలోకి వెళ్తాయి. శరీరంలోని వివిధ సమస్యలకు చెక్ పెడతారు. నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 5 కరివేపాకు, 1 వెల్లుల్లి తింటే.. ఊబకాయం దూరమవుతుంది. ఒబిసిటీతో బాధపడేవారు ఉదయాన్నే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తింటే బరువు తగ్గుతారు. ఎందుకంటే కరివేపాకులోని ఔషధ గుణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. అదేవిధంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను ఎఫెక్టివ్‌గా కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
 
వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారం. వెల్లుల్లిలోని అల్లిసిన్, డయల్ డైసల్ఫైడ్, డయల్ ట్రైసల్ఫైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉన్న సల్ఫర్ దీనికి కారణం. అలాగే కరివేపాకులో ఉప్పు తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పదార్థాలను రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
 
శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే, శరీరం శుభ్రంగా ఉండాలంటే తెల్లవారుజామున ఖాళీ కడుపుతో వెల్లుల్లి, కరివేపాకులను తీసుకుని, ఒక గ్లాసు వేడినీళ్లు తాగాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఉదయాన్నే కరివేపాకు, వెల్లుల్లిపాయలు తినాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కరివేపాకు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.