బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:43 IST)

సీతాఫలం గుజ్జును ఇలా చేస్తే..?

సీతాఫలం చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ, కొందరైతే ఈ కాలంలో దీనిని తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయని అంటారు.  ఆయుర్వేదం ప్రకారం ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. దీనిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక తీసుకోవాలనిపిస్తుంది.. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
 
1. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తప్రసరణకు చాలా మంచివి. రోజూ కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండుసార్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 
 
2. సీతాఫలం గింజలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. రోజూ మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా ఈ పొడిని కలిపి తీసుకుంటే కడుపులోని పురుగులు తొలగిపోతాయి. 
 
3. సీతాఫలంలోని గుజ్జును తీసి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. సీతాఫలం గింజలను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది. 
 
4. సీతాఫలం తొక్కలను ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఓ బాటిల్లో నిల్వచేసుకోవాలి. రోజూ మీరు చేసుకునే కూరల్లో ఈ పొడిని సేవిస్తే అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
5. కొంతమందికి పళ్లు తోముకునేటప్పుడు దంతాల నుండి రక్తం కారుతుంది. అలాంటప్పుడు సీతా గింజల పొడిని ఉపయోగించి పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా మారుతాయి.