శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:57 IST)

గర్భనిరోధక మాత్రలు వాడితే..?

చాలామంది మహిళలు గర్భం రాకుండా ఉండాలని గర్భనిరోధక మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులు వాడిన వారికే.. మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. ఈ మందులు కారణంగా నాడీవ్యవస్థలో నరాల మీద ఉండే రక్షణ పొర నాశనమై కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ మాత్రలు ఎక్కువగా వాడిన మహిళల్లో ఎంఎస్ రిస్క్ 50 శాతం ఎక్కువగా ఉందని వెల్లడైంది.
   
 
ఊబకాయం ఉన్న స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వారిలో ఆకలిని పెంచే హోర్మోన్స్ ఎక్కువగా విడుదల కావడమే. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే.. కేంద్రియ నాడీవ్యవస్థలోని నరాల చుట్టూ రక్షణగా ఉండే మైలీన్ అనే ఫైబర్ డామేజ్ అవడం వలనే. 
 
దాంతో శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ దానిమీద అదే దాడి చేసుకుంటుంది. ఫలితంగా శరీరం నెమ్మదిగా నెమ్మదిగా మొద్దుబారినట్టవుతుంది. కండరాలు బలహీనమవుతాయి. కంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు పెరిగాక వైకల్యం బారిన పడతారని స్పష్టం చేశారు.
 
ఇంతకుముందు జంతువుల మీద జరిగిన పరిశోధనల్లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు ఎంఎస్ రిస్క్‌ను తగ్గిస్తాయి లేదా ఆలస్యం చేస్తాయని వెల్లడైంది. దానికి పూర్తి విరుద్ధంగా నాడీవ్యవస్థ మీద పనిచేసి కండరాల బలహీనతకు కారణమవుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. కనుక ఇలాంటి మందులు వాడడం మానేయండి...