శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:40 IST)

మునగ బెరడును ఎండబెట్టి ఇలా చేస్తే..?

మునగలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. 
 
నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్కి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వలన నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. 
 
అన్నింటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంగస్తంభన సమర్థవంతంగా లేనివారు... మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గిందనిపిస్తే... మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.