మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (13:14 IST)

అరచేతుల్లో చెమట వస్తుందా.. ఏం చేయాలి..?

చేతులు, వేళ్లు కొన్ని ఆరోగ్య రహస్యాల్ని చెబుతాయి. వీటి రంగు, చర్మం తీరును బట్టి శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను అంచనా వేయవచ్చు. అదెలాగంటే ఓ సారి తెలుసుకుందాం.. 
 
బ్లూ ఫింగర్‌టిప్స్‌:
చేతి వేళ్లపై నీలి రంగులో కనిపిస్తుంటే, మచ్చలు ఉంటే రక్తప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్ధం. దీన్ని రేనూడ్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇది అంత ప్రమాదకమైనదేమీ కాదు. కానీ దీని వలన చేతివేళ్లు, అరికాళ్లు ఎరుపు, నీలం లేదా తెలుపు రంగులోకి మారుతాయి. అప్పుడు మంటతోపాటు దురద కూడా పుడుతుంది. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుంటుంది. 
 
వణికే చేతులు:
కెఫిన్‌ ఎక్కువగా తీసుకునే వారిలో, ఆందోళనలో ఉన్నవారిలో, ఆస్తమా, ఇతర మానసిక రోగాలకి సంబంధించిన మందులు వాడేవారిలో ఈ రకమైన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నరాల బలహీనత ఉండేవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. 
 
అరచేతుల్లో చెమటలు: 
కొంతమందికి అరచేతుల్లో చెమట వస్తుంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైనా, జీవక్రియ రేటుని ప్రేరేపించే ఓవర్‌ యాక్టివ్‌ థైరాయిడ్‌ విడుదలయినప్పుడు అరచేతుల్లో చెమట పుడుతుంది. కానీ ప్రతిరోజూ ఇలానే జరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.