మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (10:39 IST)

వేసవికాలంలో రాగిజావ.. ఉపయోగాలు.. ఇలా తయారు చేసుకుంటే..?

Ragi Java
వేసవికాలంలో పోషకాహారం తీసుకోవాలి. అది కూడా ద్రవ రూపంలో అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలా తేలికగా జీర్ణమయ్యే వాటిలో రాగి జావ ఒకటి. రాగిజావను ఇంట్లోనే ఉండి తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు మాత్రమే. 
 
ముందుగా రెండు చెంచాలు రాగిపిండిని కప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు వేసి.. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్లు కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల ముక్కలు వేసుకుని దింపేయాలి. 
 
వేడి తగ్గకన్న ముందే బౌల్‌లో జావను తీసుకుని అందులో పెరుగు కలుపుకొని తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక వేళ రాగిజావ కాస్త తియ్యగా చేసుకోవాలంటే రాగి పిండిలో బెల్లం ముక్క వేసుకుని అరగ్లాసు పాలు కలిపి ఉడికించుకోని తాగాలి.
 
రాగుల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు ఏ, బీ, సీ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.