మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 6 జూన్ 2024 (19:33 IST)

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

Safe food tips for pregnant mothers
జంట నగరాల్లో గర్భిణీ స్త్రీలలో గ్యాస్ట్రోఎంటెరిటిస్, విరేచనాలు, జాండిస్ (కామెర్లు) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం సురక్షితమైన ఆహారపు అలవాట్లపై ఆచరణీయ సూచిక-గమనికను విడుదల చేసింది.
 
ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం అధిపతి డాక్టర్ లతా శశి తన అభిప్రాయాలను పంచుకుంటూ...“ఈ సంవత్సరం ‘ప్రిపేర్‌ ఫర్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌’ (ఊహించని వాటికి సిద్దంగా ఉండండి) థీమ్‌తో గర్భిణీ స్త్రీలకు ఆహార భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. తల్లిగా మారాలనుకనే మహిళలు గ్యాస్ట్రోఎంటెరిటిస్, కామెర్లు, విరేచనాలు వంటి అనారోగ్య పరిస్థితులను నివారించడానికి అదనపు-ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని’’ సూచించారు.
 
అనుసరించాల్సిన కొన్ని ప్రధాన ఆహార భద్రతా చర్యలు:
- బయట భోజనం చేయాల్సిన సమయంలో పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లండి. వీటిని గుర్తించడానికి ఆన్‌లైన్ రివ్యూలను చదవండి.
- తాజాగా వండి, వేడి-వేడిగా వడ్డించే వంటకాలను ఆర్డర్ చేయండి. సురక్షితమైన సీలింగ్‌ లేదా వేడి చేసిన నీళ్లను మాత్రమే బాటిల్స్‌లో వినియోగించండి.
-సీ ఫుడ్‌ తీనే సమయంలో మంచిగా వండారా లేదా అనేది పరీక్షించండి., లేదంటే ప్రమాదకరమైన బాక్టీరియా దరిచేరుతుంది. ఫుడ్‌ స్టోర్‌లు లేదా బఫేల నుండి ముందస్తుగా ప్యాక్ చేసిన సలాడ్‌లు, ఆహార పదార్థాలను నివారించండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆరుబయట ప్రదర్శించి ప్రమాదకర సూక్ష్మజీవులను నింపుకుని ఉంటాయి.
- తినే ముందు సబ్బు-నీటితో చేతులను శుభ్రంగా కడగాలి. సబ్బు-నీరు అందుబాటులో లేనట్లయితే కనీసం 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించండి.
- ముఖ్యంగా ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం శ్రేయస్కరం.
- స్ట్రీట్ ఫుడ్ అపరిశుభ్రత ప్రమాణాలకు నెలవుగా మారింది.. కాబట్టి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. బయట తినే పచ్చి ఆహారాలు.. ముఖ్యంగా పానీయాలు (పానీ పూరీ రసం, జల్ జీరా, చెరకు రసం, మొలకలు-స్ప్రౌట్స్‌ వంటివి) మానుకోండి.
- మిగిలిపోయిన వాటిని తినడం మానేయండి. ప్రత్యేకించి వాటిని సరిగ్గా నిల్వచేయకుండా మళ్లీ వేడి చేసి తినడం అత్యంత ప్రమాదకరం. 
ఈ మార్గదర్శకాలను అనుసరించడంతో పాటు ‘ప్రిపేర్‌ ఫర్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌’ను అనుసరిస్తూ గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యానికి, వారి బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదాలను తగ్గిస్తూ సురక్షితంగా భోజనాన్ని ఆనందించవచ్చు.