శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. అటవీ అందాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (19:12 IST)

వెస్ట్ బెంగాల్‌లో దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రం

దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్లను సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ జరిగిన సమావేశంలో ఆ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు వార్డెన్ అజామ్‌ జాయిదీ మాట్లాడుతూ 'గంగానది పశ్చిమ బంగాలో సుందర్‌బన్స్‌ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందన్నారు. ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతమే కాకుండా టైగర్‌ రిజర్వ్‌ కూడా అని చెప్పారు. ఆ ప్రాంతంలో గంగా నదిని డాల్ఫిన్స్‌ రిజర్వ్‌గా ప్రకటిస్తామని చెప్పారు. 
 
అలాగే డాల్ఫిన్లను చంపకుండా ఉండేందుకు మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామని, అలాగని వారి హక్కుల్ని తాము హరించబోమని ఆయన తెలిపారు. మన దేశంలో ఇప్పుడు డాల్ఫిన్ల సంఖ్య రెండు వేల లోపే ఉందని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.