మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (13:32 IST)

కలబంద జెల్‌‌తో అందం.. జ్యూస్‌తో ఒబిసిటీ పరార్

చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి, కాంతివంతంగా ఉంచుకోవడానికి కలబంద జెల్‌ చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం కాస్మెటిక్‌ రంగంలో కలబందకు మంచి డిమాండ్‌ ఉంది. ఫేస్‌ మాయిశ్చర్‌గా, కేశాల సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది. బట్టతలను నివారిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. 
 
చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తుంది. కంటికింద నలుపును పోగొడుతుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే ముడతలను తొలగిస్తుంది. సోరియాసిస్‌, గజ్జి తదితర చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది.  
 
అధిక బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతో పాటు కలబంద రసాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కలబంద శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఈ కలబంద రసం జీర్ణక్రియలు పెంచటానికి చక్కగా పనిచేస్తుంది. కప్పు వేడినీళ్ళల్లో కలబంద రసం, అల్లం ముక్కు వేసుకుని బాగా వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుటలో గ్రీన్ టీ దివ్యౌషధంగా సహాయపడుతుంది. అలానే గ్రీన్ టిలో కలబంద రసం వేసుకుని వేడిచేసి ఉదయాన్నే, రాత్రివేళ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.