శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మనీల
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (20:59 IST)

పుదీనా, కలబందలతో మోచేతుల వద్ద నలుపును నివారించవచ్చు.

ప్రతి రోజూ తయారుచేసుకొనే వంటల్లో పుదీనా తప్పనిసరిగా వాడుతుంటారు. ఇది వంటలకు మంచి రుచి, ఫ్లేవర్‌ను మాత్రమే అందివ్వడం కాదు, సౌందర్యానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. మోచేతుల వద్ద నలుపును నివారించడానికి ఒక కప్పు నీళ్ళు పోసి అందులో పుదీనా వేసి మరిగించి నిమ్మరసం పిండి, ఈ మిశ్రమాన్ని కాటన్‌తో మోచేతులకు పట్టించి తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి.
 
అలాగే ఇంటి ఆవరణలో లేదా పెరట్లో ఉండే కలబంద వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అలొవెరా జెల్‌ను అప్లై చేయడం ద్వారా స్కిన్ పిగ్న్మెంటేషన్‌ను తొలగిస్తుంది. అలోవెరా జెల్, తేనె మిశ్రమాన్ని అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేస్తే, చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
ఇకపోతే రెండు చెంచాలా పెరుగు, రెండు చెంచాల వెనిగర్‌ను మిక్స్ చేసి మోచేతులకు అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.