శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (15:38 IST)

ఈ 3 చిట్కాలతో మోచేతుల అందం.. ఎలా..?

కొందరికైతే మోచేతులు నల్లగా, బరకగా మారి ఉంటాయి. వీటి కారణంగా కురచ చేతులున్న దుస్తులు వేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారు పడుకునే ముందు మోచేతులను గోరువెచ్చని నీళ్లతో కడిగి ఫ్యూమిక్‌రాయితో రుద్దుకోవాలి. ఆ తరువాత కొబ్బరినూనె లేదా ఆలివ్‌నూనెతో ఆ ప్రాంతాన్ని మర్దన చేయాలి. నిత్యం ఇలా చేయడం వలన చర్మం మెత్తబడుతుంది. 
 
1. రెండు చెంచాల కొబ్బరి నూనెకు అరచెంచా నిమ్మరసం జతచేసి మోచేతులకు రాసుకుని పావుగంటపాటు మర్దన చేయాలి. వీలుంటే ఇలా రోజులో రెండుమూడు సార్లు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మోచేతుల నలుపు తగ్గిపోతుంది. దాంతో మోచేతులు చూసేందుకు మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
 
2. నిమ్మకాయ ముక్కకు పంచదారను అద్ది మోచేతులు, మోకాళ్ల మీద 10 నిమిషాల పాటు రుద్దాలి. ఇలా రెండు రోజుల కోసారి చేస్తే మోచేతులు మృదువవుతాయి. చెంచా పెరుగుకు చిటికెడు బాదం పొడి కలిపి మోచేతులకు మాస్క్‌లా వేసుకోవాలి. ఈ మాస్క్‌ తేమ ఆరిన తరువాత చల్లటి నీళ్లతో శుభ్రపరచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే మోచేతులు తాజాగా మారుతాయి. 
 
3. 2 స్పూన్ల పసుపులో కొద్దిగా నీరు కలిపి మోచేతులకు రాసుకోవాలి. ఓ 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి చేసిన మోచేతులపై గల మచ్చలు, పులిపిరులు పోతాయి.