శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (13:23 IST)

నాజూకైన శరీరం కోసం ఏం చేయాలి..?

రాత్రిపూట భోజనం మానేయడం, మధ్యాహ్నం ఆకలితో పని చేసుకోవడం, వారం అంతా ట్రెడ్మిల్ యంత్రంపై పరుగులు తీయడం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. మనం ఆరోగ్యం, ఫిట్నెస్‌గా ఉండాలంటే.. మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ కింద తెలిపిన చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. నాజూకైన శరీరం ఎప్పుడూ మీ సొంతం చేసుకోవచ్చును.
 
సాధ్యమైనంత వరకు అధిక క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. మీరు రోజువారి వ్యాయామంలో సరిసమాన బరువు కలిగి ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే వ్యాయామం చేయడం చాలా అవసరం. మీరు తీసుకునే భోజనంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సామాన్యంగా అన్నింటిలో కొవ్వు, క్యాలరీలు కలిగి ఉండడం వలన అవి తీసుకోవడం కారణంగా మీరు లావుగా మారే ప్రమాదం ఉంది.
 
వ్యాయామం చేయడం చాలా అవసరం. ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం. రోజుకు కనీసం 6-8 లీటర్ల నీరు తప్పకుండా తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, చాక్లెట్ బార్లు, వెన్న వంటి పదార్థాలు లేని ఆహారాలు తీసుకుంటే చాలు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నాజూకైన, కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. కాబట్టి చేసి చూడండి.. మీకే తేడా కనిపిస్తుంది.