సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 16 జులై 2018 (16:00 IST)

జుట్టు ఒత్తుగా పెరగడానికి... మెంతులు కాస్త కరివేపాకు తీసుకుంటే?

మెంతుల్లోని మాంసకృత్తులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కుదుళ్లకు పోషణనిచ్చి వెంట్రుకల చివర్లు చిట్లకుండా అడ్డుకుంటాయి. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వలన మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు

మెంతుల్లోని మాంసకృత్తులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కుదుళ్లకు పోషణనిచ్చి వెంట్రుకల చివర్లు చిట్లకుండా అడ్డుకుంటాయి. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వలన మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది. పావు కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెలో అరచెంచా మెంతులు వేసి కొన్ని రంటల పాటు నానబెట్టాలి.
 
ఈ నూనెను తలకు రాసుకుని అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. చుండ్రును నివారించడంలో మెంతుల్లోని పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. గుప్పెడు మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ముద్దలా చేసుకోవాలి. దీనిలో చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పూతలా వేయాలి. ఇలా తరచుగా చేయడం వలన చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి.
 
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతో ఉపకరిస్తాయి. రెండు చెంచాలు నానబెట్టిన మెంతులు కొద్దిగా కరివేపాకును పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టించడం వలన వెంట్రుకలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి.