శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 16 జులై 2018 (09:35 IST)

కాలిన గాయాలకు వంటింటి చిట్కాలు.....

వంటింట్లో అప్పుడప్పుడు చేతులు కాల్చుకోవడం, గాయాలు చేసుకోవడం సహజమే. పెనమో, వేడి గిన్నో చేయికి తగిలి చురుక్కుమనడం మనకు అనుభవమే. అలాంటి గాయాల నుండి ఉపశమనం కలిగించేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం.

వంటింట్లో అప్పుడప్పుడు చేతులు కాల్చుకోవడం, గాయాలు చేసుకోవడం సహజమే. పెనమో, వేడి గిన్నో చేయికి తగిలి చురుక్కుమనడం మనకు అనుభవమే. అలాంటి గాయాల నుండి ఉపశమనం కలిగించేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం.
 
కాలిన గాయాన్ని మెుదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచిది ఫలితాలను పొందవచ్చును. ఈ గాయాలకు తేనెను రాసుకుంటే ఇన్‌ఫెక్షన్స్ కూడా తొలగిపోతాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకున్న వెంటనే ఉపశమనం కలుగుతుంది. టీని కాచిన తరువాత కాసేపు దానిని నీటిలో ఉంచుకోవాలి.
 
కాఫీ చల్లారిన తరువాత కాలిన గాయాలపై పెడితే మంట తగ్గుతుంది. కాలినగాయంపై నువ్వుల నూనెను రాయడం వలన కూడా ఉపశమనం లభిస్తుంది. నిమ్మతొక్కలను పేస్ట్‌లా తయారుచేసుకుని గాయాలపై రాసుకుంటే కూడా చాలు. తులసి ఆకులను కాలిన గాయాలపై ఉంచడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చును. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు జల్లడం వలన గాయం త్వరగా మానుతుంది.