సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (20:55 IST)

వంటింటిని ఎలా అమర్చుకోవాలంటే?

వంటిల్లు అందరికి చాలా ముఖ్యమైనది. ఈ వంటింటికి దిక్కులు, స్థలాలు, రంగులు చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలన్నీ దక్షిణ, పడమర దిశగా ఉండవలెను. కాబట్టి ఇంటిని కట్టుకునేటప్పుడు వంటింటిన

వంటిల్లు అందరికి చాలా ముఖ్యమైనది. ఈ వంటింటికి దిక్కులు, స్థలాలు, రంగులు చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియమాలన్నీ దక్షిణ, పడమర దిశగా ఉండవలెను. కాబట్టి ఇంటిని కట్టుకునేటప్పుడు వంటింటిని దక్షిణ, పడమర దిశగా అమర్చుకుంటే మంచిది. అలాకాకుంటే ఉత్తరం లేదా తూర్పు దిశగా కూడా అమర్చుకోవచ్చును.
 
కిటికీలను పడమర దిశగా చెరుకునేలా కట్టించికోవాలి. ఇలా వంటింటిని నిర్మించుకున్న తరువాత అక్కడికి కావలసిన వస్తువులు అన్నింటినీ కూడా దక్షిణ, పడమర దిశగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు వంటచేయు దిశ పడమర దిశగా ఉండవలెనని వాస్తు నిపుణులు చెబుతున్నారు. స్టౌవ్‌ దక్షిణ, పడమర దిశగా ఉన్నప్పుడు సింక్‌ను ఉత్తర, తూర్పు దిశగా ఉంచుకోవాలి. మీ వంటింటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే ఇళ్లు కూడా సంతోషంగా ఉంటుంది.