జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?

hair loss
సిహెచ్| Last Modified శనివారం, 10 ఆగస్టు 2019 (21:50 IST)
ఇటీవలకాలంలో ఎక్కువ మంది జుట్టు రాలిపోవడం, నిర్జీవంగా ఉండడం సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యలకు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు.

1. ఒక టీస్పూను తాజా నిమ్మరసం, ఒక టీస్పూను ఉప్పు, ఒక టీస్పూను కలబంద రసం కలిపి జుట్టుకు రాసుకోవాలి. అరగంట అయ్యాక చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండుసార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే జుట్టు మెరుస్తూ ఉంటుంది.

2. పావు కప్పు పెరుగుకి గుడ్డులోని తెల్లసొనను కలిపి తడిగా ఉన్న జుట్టుకి రాసి అరగంట పాటు వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేయడం వలన జుట్టులో తేమ నిండి మెత్తగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

3. తలస్నానం చేసిన తరువాత చివర్లో రెండు టేబుల్ స్పూన్ల మాల్ట్ వెనిగర్‌ను రాస్తే జుట్టు మెరుస్తుంది.

4. అరటిపండ్లు, తేనె, పెరుగు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కలిపి తయారుచేసిన డ్రింక్‌ను కొన్ని వారాల పాటు తాగడం వలన జుట్టు ఊడడం తగ్గిపోతుంది.

5. తలను సాధ్యమైనంత పరిశుభ్రంగా, నూనె లేకుండా ఉంచుకునేలా చూసుకోవాలి. అందుకోసం తరచూ తలస్నానం చేస్తుండాలి. దానివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.దీనిపై మరింత చదవండి :