సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (18:36 IST)

తేనెతో ఫేషియల్ మాస్క్.. స్నానం చేసే నీటిలో తేనెను కలిపి?

యాంటీ బాక్టీరియా గుణాలు ఉన్న తేనె మొటిమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మాయిశ్చరైజర్‌లో వుండాల్సిన అన్ని లక్షణాలు తేనెలో వున్నాయి. చర్మం పొడిబారినట్లైతే.. పగిలినట్లు వుండే పెదవులకు తేనె మందుగా పనిచేస్తు

యాంటీ బాక్టీరియా గుణాలు ఉన్న తేనె మొటిమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మాయిశ్చరైజర్‌లో వుండాల్సిన అన్ని లక్షణాలు తేనెలో వున్నాయి. చర్మం పొడిబారినట్లైతే.. పగిలినట్లు వుండే పెదవులకు తేనె మందుగా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె వేసుకుని గనుక స్నానం చేసినట్లయితే చర్మం, మృదువుగా తయారవుతుంది. 
 
ఇంకా మార్కెట్‌లో లభ్యమయ్యే యాంటీ ఏజియింగ్‌ క్రీముల తయారీలో తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఎక్కువగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకునేందుకు సాయపడతాయి. అలాగే ఫేషియల్‌ మాస్క్‌గా తేనె బాగా ఉపయోగపడుతుంది. 
 
టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, పచ్చివి అవకోడా ముక్కలు, ఓట్‌మీల్‌ పొడి అన్నిటిని ముద్దగా చేసుకుని ముఖానికి పట్టించి పావు గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.