శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (14:05 IST)

చికాగో విమానాశ్రయం నుంచి శంషాబాద్‌కు ఫ్లైట్.. ఇక నాన్ స్టాప్ సేవలు

చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. చాలా కాలంగా కలగా ఉన్న హైదరాబాద్‌-అమెరికా మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంపట్ల అధికారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. 
 
238 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో ఎనిమిది ఫస్ట్‌క్లాస్‌, 35 బిజినెస్‌ క్లాస్‌, 195 ఎకానమీ సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నలుగురు కాక్‌పిట్‌, 12 మంది క్యాబిన్‌ క్రీవ్‌ సిబ్బంది ఉన్నారు. విమానాన్ని నడిపిన నలుగురు పైలట్లను శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు ఘనంగా సన్మానించారు.