శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (20:23 IST)

డీజల్ టోకు విక్రాయలపై రూ.25 పెంపు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెలతో పాటు చమురు ధరలు, నిత్యావసర సరకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. దీంతో భారత్‌లో టోకు విక్రయదారులకు విక్రయించే డీజల్‌పై ఏకంగా రూ.25 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. ఈ మేరకు దేశంలోని ప్రభుత్వం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
కాగా, రోజువారీ సమీక్ష విధానంలో ఈ చమురు ధరలను చివరిసారిగా గత యేడాది నవంబరు 4వ తేదీన పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీటి ధరలను పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు కేంద్ర తలొగ్గింది. దీంతో చమురు ధరలు పెంచలేదు. 
 
అయితే, ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ధరలను పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ధరల పెంపు జోలికి కేంద్రం వెళ్లలేదు. ఇదిలావుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర 140గా ఉంది. దీంతో దేశంలో ఏ క్షణమైనా పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాంబు పేలే అవకాశం లేకపోలేదు.