శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 జనవరి 2023 (11:52 IST)

కొత్త సంవత్సరంలో షాకిచ్చిన చమురు సంస్థలు

gas cylinder
దేశ ప్రజలకు చమురు కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. ఒకవైపు దేశ ప్రజలంతా కొత్త సంవత్సరాది వేడుకల్లో మునిగిపోయివుంటే, ఆయిల్ కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా వంట గ్యాస్ ధరను పెంచేశాయి. గత యేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు పెంచిన ఆయిల్ కంపెనీలు ఇపుడు మరోమారు ధరలను పెంచేశాయి. దీంతో వాణిజ్య అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలు మరింత ప్రియమయ్యాయి. 
 
నెల నెలా ధరల పునఃసమీక్షలో భాగంగా, జనవరి ఒకటో తేదీన వంట గ్యాస్ ధరలపై సమీక్ష జరిపి ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. అందులోభాగంగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేరకు పెంచేసింది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు 
 
అయితే, కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై నేరుగా ప్రభావం చూసే అవకాశం ఉంది. రెస్టారెంట్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు తాము తయారు చేసే తినుంబడరాల ధరలను పెంచే అవకాశం లేకపోలేదు. ఇది సామాన్యులపై ధరల ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం పెంచిన ధరల ప్రకారం 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేరకు పెంచడంతో ఢిల్లీలో రూ.1769కి చేరింది. అలాగే, ఇది ముంబైలో రూ.1721కి చేరగా, కోల్‌కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కు చేరింది.