శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:39 IST)

పసిడి కొనేవారికి శుభవార్త.. బంగారం ధరలు పడిపోయాయి..

బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి రెండు రోజులుగా నేలచూపు చూస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 క్షీణించింది. దీంతో ధర రూ.58,470కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.230 క్షీణతతో రూ.53,580కు దిగొచ్చింది. 
 
పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.940 పైకి కదిలింది. దీంతో ధర రూ.75,150కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.