శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:27 IST)

బంగారం కొనే వారికి శుభవార్త.. వరుసగా రెండో రోజులు డౌన్

బంగారం కొనే వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.48,220 పలుకుతోంది. నిన్న రూ.160 తగ్గింది. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.4,822కి దొరుకుతోంది. 
 
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,560, ముంబైలో రూ.46,220, న్యూఢిల్లీలో రూ.46,350, కోల్‌కతాలో రూ.46,600గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరులో రూ.44,200కి లభిస్తోంది.
 
ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలను చూస్తే.. చెన్నైలో రూ.48,610, ముంబైలో రూ.47,220, న్యూఢిల్లీలో రూ.50,560, కోల్‌కతాలో రూ.49,300గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో రూ.48,220కి లభిస్తోంది.