శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (11:27 IST)

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ : అమాంతం పెరిగిన కేసులు

దేశంలో కరోనా వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. తాజాగా 17,87,283 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,164 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. 
 
దీంతో మొత్తం కేసులు 3.25 కోట్లకు చేరాయి. గడిచిన 24 గంటల్లో మరో 607 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 200మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 4,36,365 మంది మహమ్మారికి బలయ్యారు.
 
ఈ రోజు కూడా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే తక్కువగా ఉంది. తాజాగా 34,159 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.63 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు మళ్లీ ఒక శాతం దాటింది. ప్రస్తుతం 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.