గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:07 IST)

కస్టమర్లను అలర్ట్​ చేసిన ఎస్బీఐ.. సెప్టెంబర్​ 30లోపు..?

దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్​ చేస్తోంది. ఆధార్​తో​ పాన్​ కార్డు నంబర్లను లింక్​ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్​ 30లోపు ఆధార్​తో పాన్​ లింక్​ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్​ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

సెప్టెంబర్​ 30 తర్వాత బ్యాంకింగ్​ సేవలు యాక్సెస్​ చేయాలంటే పాన్​ ఆధార్ లింక్​ తప్పనిసరిగా పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాలను ఆటోమేటిక్​గా 'ఇన్​ఆపరేటివ్' చేస్తామని హెచ్చరించింది.
 
దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ''ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాంకింగ్​ సేవలు నిరంతరాయంగా పొందేందుకు మీ ఆధార్​తో పాన్​ కార్డు లింక్​ చేయడం తప్పనిసరి.

కేంద్ర ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటే ఆధార్​ పాన్​ లింక్​ చేయని ఖాతాలు ఆటోమేటిక్​గా ఇనాక్టివేట్​ అవుతాయి. దయచేసి కస్టమర్లు గమనించగలరు'' అని ట్వీట్​లో పేర్కొంది.