IPL Jio Plans అదుర్స్, వివరాలు ఇవే
ఏప్రిల్ 9 నుంచి ఐపిఎల్ సీజన్ స్టార్ట్ అవుతోంది. ఈ నేపధ్యంలో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది రిలయన్స్ జియో. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ అన్ని ఐపీఎల్ మ్యాచులను చూసే సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే ప్రిపెయిడ్ కస్టమర్లకు డిస్నీతో పాటు హాట్ స్టార్ చందాతో కలిపి ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి.
జియో 401 ప్రిపెయిడ్ ప్లాన్ కింద 3జిబి హైస్పీడ్ డేటాను పొందే వీలుంటుంది. దీనితో పాటు డిస్నీ-హాట్ స్టార్ విఐపి చందాతో పాటు 6జిబి అడిషనల్ డేటా లభిస్తుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.
జియో 598 ప్రిపెయిడ్ ప్లాన్ కింద 56 రోజుల కాలపరిమితితో 2 జిబి డేటా, ఉచిత అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ పొందొచ్చు.
జియో 777 ప్రిపెయిడ్ ప్లాన్ కింద 84 రోజుల కాలపరిమితితో ప్రతిరోజూ 1.5 జిబి డేటాను, అపరిమిత కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. ఎలాంటి అడిషనల్ చార్జీలు లేకుండా ఏడాది పాటు డిస్నీ-హాట్ స్టార్ పొందవచ్చు.
జియో 2599 ప్రిపెయిడ్ ప్లాన్ కింద ఏడాది పాటు జియో ఉచిత కాల్స్ పొందవచ్చు. ప్రతిరోజూ 2 జిబి డేటాతో పాటు అదనంగా మరో 10 జిబి డేటా పొందవచ్చు. అలాగే 399 రూపాయల విలువైన డిస్నీ-హాట్ స్టార్ చందా పొందే అవకాశం వుంది.