ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (11:31 IST)

బిర్యానీ ప్రియులకు కేఎఫ్‌సీ గుడ్ న్యూస్.. నోరూరించే వెరైటీలతో..?

బిర్యానీ ప్రియులకు కేఎఫ్‌సీ గుడ్ న్యూస్ చెప్పింది. రుచికరమైన బిర్యానీ బకెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ అభిమానుల కోరికపై ప్రత్యేకమైన రుచులతో సువాసనలతోకూడిన మేలురకం బియ్యం, మసాలాలు, వేయించిన ఉల్లిపాయ, స్పైసీ గ్రేవీతో బిర్యానీని తయారు చేసినట్లు కేఎఫ్‌సీ తెలిపింది. ఆర్డర్ చేసిన వెంటనే పికప్ కోసం సిద్ధం చేస్తారు. ఈ కేఎఫ్‌సీ బిర్యానీ బకెట్‌ ధర రూ. 169 నుంచి మొదలవుతుంది. 
 
అంతేగాకుండా... కేవలం ఒక బిర్యాని మాత్రమే కాదు. అందులో కొన్ని రకాల బిర్యానీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అవేంటంటే.. హాట్‌ క్రిస్పీ బిర్యానీ బకెట్‌, పాప్‌ కార్న్‌ చికెన్‌ బిర్యానీ బకెట్‌, స్మోకీ గ్రిల్డ్‌ బిర్యానీ బకెట్‌, వెజ్‌ బిర్యానీ బకెట్‌ పేర్లతో నాలుగు రకాల బిర్యానీలను తయారు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.