మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (22:51 IST)

కేఎఫ్‌సీ ప్రియులకు షాక్:పిండి పూసిన కోడి తల

కేఎఫ్‌సీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్రైడ్ చికెన్‌లో ఫేమస్ అయిన కేఎఫ్‌సీ చికెన్‌ను లొట్టలేసుకుని తినేవారు చాలామంది. అయితే కేఎఫ్‌సీ చికెన్‌ను ఇంటికి తెచ్చుకున్న మహిళకు చుక్కలు కనిపించాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గాబ్రియేల్‌ అనే మహిళ కేఎఫ్‌సీ టేక్‌అవే బాక్స్‌ను ఆర్డరిచ్చి తెప్పించుకుంది. ఐతే చికెన్‌ బాక్స్‌లో పిండి పూసిన కోడి తల కనిపించడంతో షాకైంది. 
 
ఉడికీ ఉడకని చికెన్ హెడ్ కనిపించడంతో ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఈ ఫోటోను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరలై కూర్చుంది. 
 
దీనిపై స్పందించిన కేఎఫ్‌సీ ఈ తప్పు మళ్లీ జరగకుండా నివారిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఆమెను కేఎఫ్‌సీ అధికారులు ఆమెను సంప్రదించి ఉచితంగా మరొక చికెన్‌ బాక్స్‌ అందించడమేకాకుండా ఆమెను, ఆమె కుటుంబం మొత్తాన్ని సదరు సెంటర్‌కు ఆహ్వానించింది. 
 
తాము ఏవిధంగా కిచెన్‌లో చికెన్‌ ప్రిపేర్‌ చేస్తామో తనిఖీ చేయమని అదే టేక్‌అవే కేఎఫ్‌సీ ప్లేస్‌కు రావల్సిందిగా కోరింది.