ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (17:33 IST)

గ్యాస్ సిలిండర్లపై లిమిట్ విధిస్తే ఇంకేముంది..?

lpg cylinder
గ్యాస్ సిలిండర్లపై లిమిట్‌ను విధించే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది గనుక జరిగితే.. ఒక కుటుంబం సంవత్సరానికి గరిష్ఠంగా 15 సిలిండర్లు మాత్రమే పొందే అవకాశం పొందగలుగుతుంది. నెలకు రెండుకు మించి సిలిండర్లను పొందలేరు. ఇప్పటివరకైతే ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోవడం గమనార్హం. 
 
ఒకవేళ ఎవరికైనా ఒక నెలలో రెండుకు మించి సిలిండర్లు అవసరమైతే... ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. 
 
కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం... 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 జూలై  6 వరకు గ్యాస్ సిలిండ్ ధర 45 శాతం పెరిగింది. 2017 ఏప్రిల్‌లో ఎల్పీజీ సిలిండర్ రూ. 723గా ఉండగా 2022 జూలై నాటికి రూ. 1,053కి పెరిగింది.