గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (15:05 IST)

రూ.634లకే LPG గ్యాస్ సిలిండర్.. నిజమేనా?

సిలిండర్ ధరలతో తలపట్టుకున్న వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్. కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో ఇండేన్ సంస్థ ఓ ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కేవలం రూ.633.5 ధరకే LPG సిలిండర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
అయితే ఇది సాధారణ సిలిండర్ కాదని.. మామూలు సిలిండర్ కంటే కొంచెం తక్కువ బరువు కలిగిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ అని ఇండేన్ చెప్పుకొచ్చింది. అంతేగాకుండా దీనిపై ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. మిగిలిన గ్యాస్ సిలిండర్ల లాగా ఇది తుప్పు పట్టదు. అయితే ఆ కాంపోజిట్ సిలిండర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?
 
సాధారణ ఎల్పీజీ సిలిండర్ కోసం దాదాపుగా రూ.900లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ కాంపోజిట్ సిలిండర్ కోసం కేవలం రూ.633.50 చెల్లిస్తే సరిపోతుంది.
 
వాస్తవానికి ఈ సిలిండర్‌లో గ్యాస్ 10 కిలోల బరువును కలిగి ఉంటుంది. 10 కిలోల గ్యాస్ నింపిన తర్వాత, ఈ కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ మొత్తం బరువు 15 కిలోలు అవుతుంది.