సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (11:31 IST)

పరుగులు పెడుతున్న పెట్రోల్ ధరలు: అంతర్జాతీయ మార్కెట్లో..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.22గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.101.66గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.94గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.101.90గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.56గా ఉండగా.. డీజిల్ ధర రూ. 101.55గా ఉంది. 
 
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.35గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.04 ఉండగా.. డీజిల్ ధర రూ.102.20గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.16 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.19గా ఉంది.