బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (22:19 IST)

Sanjay Malhotra appointed new RBI governor ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

sanjay malhotra
Sanjay Malhotra appointed new RBI governor భారత రిజర్వు బ్యాంకు కొత్త గవర్నరుగా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నరుగా ఉన్న శక్తికాంత్ దాస్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో కొత్త గవర్నరుగా సంజయ్ మల్హోత్రా పేరును ఎంపిక చేశారు. ఆర్బీఐ గవర్నరుగా శక్తికాంత్ దాస్ గత 2018 డిసెంబరు 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం పూర్తయినప్పటికీ మరికొన్నాళ్లపాటు పదవీకాలాన్ని పొడగించారు. ఈ పొడగించిన పదవీకాలం కూడా మంగళవారంతో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్‌ను కేంద్రం కేబినెట్ నియామకాల కమిటీ ఎంపిక చేసింది. దీంతో ఆర్బీఐ 26వ గవర్నరుగా సంజయ్ మల్హోత్రా సేవలు అందించనున్నారు. 
 
ఈయన ప్రస్తుతం కేంద్ర ఆర్థక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పని చేస్తున్నారు. 1990 బ్యాచ్‌ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌ నుంచి కంప్యూటర్ సైన్స్‌‍లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్ టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీ సబ్జెక్టులో కూడా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సివిల్స్ రాసి ఐఏఎస్ అయిన సంజయ్ మల్హోత్రా... తన 33 యేళ్ల సర్వీసులో విద్యుత్, ఆర్థిక, పన్నులు, సమాచార సాంకేతికత, గనుల శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు.