శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (13:06 IST)

ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్.. రూ.5 వేల కోట్లు పెట్టి..?

ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎయిర్ ఇండియాను ద‌క్కించుకోవ‌డానికి టాటా స‌న్స్‌తో స్పైస్ జెట్ య‌జ‌మాని అజ‌య్‌సింగ్ పోటీప‌డిన‌ప్ప‌టికీ.. స్పైస్ జెట్ కంటే ఐదు వేల కోట్లు ఎక్కువ పెట్టి టాటా గ్రూప్ దక్కించుకుంది. 
 
ఎయిర్ ఇండియా గతంలో టాటా గ్రూప్ కంపెనీ. ఈ కంపెనీని 1932లో జేఆర్డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం తరువాత విమానయాన రంగం జాతీయం చేయబడింది. దీని కారణంగా ప్రభుత్వం టాటా ఎయిర్‌లైన్స్ 49 శాతం వాటాలను కొనుగోలు చేసింది. తరువాత ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. జూలై 29, 1946 న ఎయిర్ ఇండియాగా పేరు మార్చబడింది. 1953లో ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. 
 
కంపెనీ వ్యవస్థాపకుడు JRD టాటా నుండి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తరువాత కంపెనీకి మళ్లీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఈ విధంగా టాటా గ్రూప్ 68 సంవత్సరాల తర్వాత మరోసారి సొంత కంపెనీని తిరిగి పొందింది.